వైఎస్ జగన్ పాదయాత్ర ఈరోజు ఇచ్చాపురంలో జరిగిన బహిరంగ సభతో ముగిసింది. ఈ పాదయాత్రకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీసీ అధ్యక్షుడు రఘవీరా రెడ్డి మాట్లాడుతూ జగన్ పాదయాత్రలో ఏముందని సెల్ఫీలు, నెత్తి మీద ముద్దులు తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదని రఘవీరా రెడ్డి వైఎస్ జగన్ పాదయాత్రపై విమర్శలు చేసినట్లు పచ్చ మీడియాలో వార్తలు వచ్చాయి.

రఘవీరా రెడ్డి ఇంకా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయమై త్వరగా తేల్చాలని అధిష్టానాన్ని కోరామని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిన దరిమిలా చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం జగన్ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నట్లు కనపడుతుంది. తెలంగాణాలో కాంగ్రెస్ – టిడిపి పొత్తుతో ప్రజలు ఏవిధంగా బుద్ధి చెప్పారో అలానే ఏపీలో కూడా బుద్ధి చెప్తామని వైసిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఇలాంటి లేనిపోని విమర్శలు  రఘవీరా రెడ్డి చేస్తున్నాడని వైసిపి శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ఆ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పిన ఏపీ ప్రజలు… రఘవీరా రెడ్డి లాంటి నాయకులని మరొక సారి అసెంబ్లీ గేటు కూడా తొక్కనీయకుండా చేస్తామని వైసిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.