ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఈ రోజు ఇచ్చాపురం లో ముగిసింది. ఈ పాదయాత్రలో జగన్ 3648 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇచ్చాపురంలో నిర్వహించిన భహిరంగ సభలో మాట్లాడిన జగన్.. రైతులపై వరాల జల్లు కురిపించారు. ప్రతీ రైతుకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని ప్రకటించిన జగన్… రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ పగటిపూట ఇస్తామన్నారు. రైతు పెట్టుబడి పేరుతో పథకం తీసుకొస్తామని… మే నెలలో ప్రతీ రైతుకు రూ.12,500 ఇస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు పెట్టుబడి తగ్గించడమే తన ఉద్దేశమన్న జగన్.. రైతులకు ఉచితంగా బోర్లు కూడా వేయిస్తామని ప్రకటించారు. అలాగే రైతులకు బీమా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్లుందని.. ప్రతీ మండలంలో కోల్డ్‌స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసి.. పంట వేసినప్పుడే కొనుగోలు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు. రైతుల గిట్టుబాటు దరల కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణనిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రైతులు ఎవరైనా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నా, ప్రమాదవశాత్తు చనిపోయిన వారి కుటుంభానికి వైఎస్సార్ భీమా కింద 5 లక్షలు చెలిస్తామన్నారు. ఈ విధంగా జగన్ రైతులపై వరాల జల్లు కురిపించారు.