వైసీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు అవినీతిపై విచారణ జరుగుతుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి సి రామచంద్రయ్య. మూడు లక్షల కోట్లు అప్పు చేసి చంద్రబాబు జల్సాలు చేస్తున్నారన్నారు. సీఎం మానసిక స్థితి సరిగా లేదని అందుకే ఏపీని అప్పుల ప్రదేశ్‌గా మార్చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పాలనలో ఏపీ అవినీతిలో నంబర్‌ వన్‌గా మారిందని విమర్శించారు. పిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో కొనసాగుతున్నట్లు స్పీకర్ ప్రకటించడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన ఓటమి ఖాయం అన్నారు రామచంద్రయ్య.

ramachandraiah