భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు అమిత్ షా ఈనాడు గ్రూపు సంస్థల అదినేత రామోజీరావును కలిశారు. రామోజీతో భేటీ సమయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీ ధర్ రావు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, బిజెపికి, ప్రదాని మోడీలకు అంతరం వచ్చిన తర్వాత ఈ కలయిక ప్రాదాన్యత సంతరించుకుంది. అదే సమయంలో విశాఖలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తో చంద్రబాబు కూడా చాలా సామరస్యంగా కలిసి తిరగడం కూడా గమనించదగ్గ పరిణామంగానే ఉంది. రామోజీరావు, అమిత్ షాలు సుమారు గంటకు పైగా భేటీ అయ్యారని సమాచారం. రామోజీని కలిశాక అమిత్ షా షటిల్ చాంపియన్ సైనా నెహ్వాల్‌ను కలుసుకున్నారు.

Tags: Ramoji Rao, Amith Sha, bjp, Tdp, Muralidhar Rao