నర్సరావుపేట తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన కార్పొరేట్ ఆఫీసులపై సెంట్రల్ జిఎస్టి అదికారులు దాడి చేశారు. హైదరాబాద్ లోని కంపెనీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును 2012 లో రాయపాటి కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ కంపెనీ జిఎస్టి చెల్లించలేదని ఆరోపణగా ఉంది. అయితే తమ ఉద్యోగులకు జిఎస్టి విషయమై అవగాహన ఉండవకపోవచ్చని రాయపాటి అన్నారు. బేగంపేట, కమలాపురి కాలనీలలోని ఆపీస్ లను అదికారులు సోదా చేశారు. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు, ట్రాన్స్ ట్రాయ్‌ ఉన్నతాధికారులు నిరాకరించారు.