నవంబర్ 7న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెరాస తమ తమ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పోటీచేస్తున్న కొండగల్ నియోజకవర్గంపై ఇప్పుడు అందరూ ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ పట్టు సాధిస్తే కాంగ్రెస్‌పై విజయం సాధించినట్లుగా తెరాస భావిస్తుంది. ఇప్పుడు ఆ కంచుకోటను బద్దలు చేసేందుకు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్‌ నేతలు మోహరించారు. అటు వన్‌ మ్యాన్‌ ఆర్మీలా, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఫైర్‌ బ్రాండ్ రేవంత్ రెడ్డి. ఐటీ, ఈడీ దాడుల తర్వాత, కొడంగల్‌ క్యాంపెయినింగ్‌లో పాల్గొంటున్నారు రేవంత్‌ రెడ్డి.

ఇక్కడ తెరాస అభ్యర్థిగా పట్నం పట్నం నరేందర్‌ రెడ్డి, నియోజకవర్గంలోనే ఉంటూ విస్త్రుత ప్రచారం చేస్తున్నారు. తన గెలుపుకోసం టీఆర్ఎస్‌ పార్టీ నేతలు, మంత్రులను ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. ఈయన మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు. కాగా రేవంత్ మొదట నిర్వహించిన ప్రచారంలో పట్నం బ్రదర్స్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పట్నం బ్రదర్స్ ను గొయ్యి తీసి బొంద పెదతానంటూ వ్యాఖ్యలు చేసారు. తెరాస గెలుపు కోసం మంత్రులు మహెందర్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్ది, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌లు, ఇప్పటికే కొడంగల్‌ నియోకజవర్గంలో విస్త్రుతంగా పర్యటనలు కొనసాగించారు.

revanth reddy

ఇటు రేవంత్‌ రెడ్డి కూడా ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రతిష్టాత్మకమైన తన నియోజకవర్గంలో, ప్రచారాన్ని ఒంటిచేత్తో కొనసాగిస్తున్నారు. ఐతే ఓవైపు అధికార పార్టీ మంత్రులు, నేతల విస్త్రుత పర్యటనలు కొనసాగిస్తుండగా, రేవంత్‌ మాత్రం కాంగ్రెస్‌ నాయకులు అవసరం లేకుండా, వన్‌ మ్యాన్‌ షోలా బైక్‌ ర్యాలీలు, రోడ్‌ షోలతో హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ఇతర నియోజకవర్గాలలో కూడా ప్రచారం చేస్తూ.. తన నియోజికవర్గంలో కూడా క్యాంపెయిన్‌ చేస్తున్నారు.

 

ఐటీ దాడుల అనంతరం, దాదాపు 20 రోజుల తర్వాత మళ్ళీ తన నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు రేవంత్. దౌల్తాబాద్‍ నుంచి రోడ్‍ షాలు, బైక్‍ ర్యాలీలతో ప్రచారాన్ని ముమ్మరం చేసి.. ప్రత్యర్థిపై ఎదురు దాడి కొనసాగిస్తున్నారు. కెసిఆర్, కేటీర్ లపై విమర్శల దాడిని రోజు రోజుకి పెంచుతున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఓటమే లక్ష్యంగా తెరాస నాయకులు పనిచేస్తున్నారు. రేవంత్ మాత్రం తాను భారీ మెజారిటీతో గెలుస్తాను అని చెబుతున్నారు. మరి ప్రజలు ఈ కొండగల్ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తారో నవంబర్ 11న తేలబోతుంది.