సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో 20 వేల మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత తనదేనని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈ రోజు(మంగళవారం) ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కోడెల మాట్లాడారు. ఈ రెండు నియోజకవర్గాలలో వైసీపీకి డిపాజిట్స్ కూడా రావన్న కోడెల.. తన చేసిన అభిరుద్దే తనను గెలిపిస్తాయన్నారు.

రాష్ట్రంలో 150 స్ధానాలకు పైగా టీడీపీ గెలుస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ నీతిబాహ్యమైన కార్యక్రమాలు చూస్తుంటే భాదేస్తుందన్నారు. తాను 35 సంవత్సరాలు రాజకీయాలలో నీతిగా బతికానని, బతుకుతున్నానని.. తమపై వైయస్‌ జగన్‌, అంబటి రాంబాబు చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు జగన్‌ ఎక్కడకు వచ్చినా తాను సిద్ధమన్నారు. తనను ఎవరు ఏమి చేయలేరని, ప్రజల మద్దతు టీడీపీకి ఉందన్నారు కోడెల.