వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విజయనగరం జిల్లాలో 3000 వేల కిలో మీటర్లు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో జగన్ అనేక మైలురాళ్ళు దాటుకుంటూ దూసుకుపోతున్నారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు వ‌స్తున్న అనూహ్య స్పంద‌న‌ను చూసి రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, పారీశ్రాకవేత్త‌లు ఇప్ప‌టికే పార్టీ కండువా క‌ప్పుకున్నారు. కాగా ప్రముఖ సినీ దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు జగన్ పాదయాత్రలో పాల్గొని సంఘీ బావం తెలిపారు. జగన్ తో పాటు కొంత దూరం వారు నడిచారు. తాము ఇక్కడ కు వచ్చి చూశాక ఆశ్చర్యం కలిగిందని, 3000 వేల కిలో మీటర్లు దూరం తర్వాత కూడా ఇంత ఆదరణ లభించడం ప్రపంచలోనే ఎక్కడ ఉండదని వారు అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి మాత్రమే ఇలాంటి శక్తి ఉంటుందనిపిస్తుందన్న వారు.. ఇది చూసిన తర్వాత తమకు కూడా స్పూర్తి కలిగించిందని, ప్రజలలో స్పందన అద్బుతంగా ఉందని కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తెలియజేసారు.