తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి టి రాజయ్య రాసలీలల ఆడియో క్లిప్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. రాజయ్య చేసిన ఈపనికి టిఆర్ఎస్ పరువు బజారున పడేలా ఉంది. ఒక రాష్ట్రానికి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి నేరుగా ఒక మహిళతో కవ్వింపు మాటలతో రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉన్న క్లిప్ పై కేసీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇప్పటికే రాజయ్యపై తన నియోజకవర్గంలో అసమ్మతి పెచ్చరిల్లిపోతుంది. ఈ నేపధ్యంలో ఇప్పుడు బయటకు వచ్చిన ఆడియో టేపులతో మరింత కష్టాలలోకి రాజయ్య కూరుకుపోయాడు. రాజయ్యకు టికెట్ రద్దు చేసి మరొక నాయకుడికి ఇవ్వాలని అసమ్మతి వర్గం టిఆర్ఎస్ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేస్తుంది.

రాజయ్య మాట్లాడిన ఆడియో టేపులలో తనతో పాటు వరంగల్ కు చెందిన మరో నేత కూడా గట్టిగానే ఇరుక్కునేలా ఆడియో టేప్స్ ఉన్నాయి. ఆ నేత గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టిఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేసాడు. ఇక అతని ఇంటి బాగోతం గురించి కూడా పూసా గుచ్చినట్లు ఉండటంతో ఆ నేత ఇప్పుడు తల పట్టుకొని ఏమి చేయాలో తెలియక కిందా మీద పడుతున్నట్లు తెలుస్తుంది. రాజయ్య మాత్రం ఈ ఆడియో టేపులను కండిస్తూ తనపై కుట్ర జరిగిందని వీటితో తనకు ఎటువంటి సంబంధం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతుండటం గమనార్హం.