వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జనరల్ సెక్రెటరీ కె. శివకుమార్‌పై ఆ పార్టీ వేటు వేసింది. శాశ్వతంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏ పార్టీకి తాము సపోర్ట్ చేయడం లేదని వైసీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పార్టీ నేత శివకుమార్.. పార్టీ లెటర్ హెడ్‌ను ఉపయోగించి ఒక పార్టీకి వైసీపీ మద్దతు తెలుపుతున్నట్టుగా సందేహం ఇచ్చారు. ఈ అంశాన్ని ఆ పార్టీ తీవ్రంగా పరిగణించి.. పార్టీ నిర్ణయాలను ధిక్కరించినందుకు ఆయనపై వేటు వేసింది. తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని వైసీపీ అభిమానులు వారి ఇష్టం ఆధారంగానే ఓటేయాలని వైసీపీ సూచించింది.
వైసీపీ తెలంగాణ నేత శాశ్వత బహిష్కరణ!
