ఈనెల 17 న విజయ్ దేవరకొండ నటించిన “టాక్సీవాలా” విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఇదొక మినీ “బహువబలి” అని అందుకే ఇంత సమయం తీసుకుందని చెప్పాడు. బాహుబలి సినిమా కోసం 2700 షాట్స్ ఉంటె, బాహుబలికి 640 షాట్స్ ఉన్నాయి. ఇదొక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే సినిమా అని, ఒక కుర్రాడు ఇంజనీరింగ్ పూర్తయిన తరువాత ఉద్యోగం రాక, నగరంలో క్యాబ్ డ్రైవర్ గా బాగా సంపాదించవచ్చని తెలిసి, క్యాబ్ డ్రైవర్ జాయిన్ అయిన తరువాత ఎదురైనా అనుభవాలకు సంబంధించి ఈ సినిమా ఉంటుందని విజయ్ చెప్పాడు.

నాకు హారర్ సినిమాలంటే భయమని, యువి క్రియేషన్స్ వారు కొత్త దర్శకుడు కథ వినడానికి రమ్మని చెబితే యువి క్రియేషన్ ఆఫీస్ కు వెళితే ఈ చిత్ర దర్శకుడు రాహుల్ తనకు ఒక కథ వినిపించబోగా, అది హారర్ చిత్రమని తెలిసి లేచి వెళ్ళిపోబోతుంటే, రాహుల్ కథ అంతా ఒక్కసారి వినమని చెప్పాడని, కథ విన్న తరువాత కాన్సెప్ట్ నచ్చి ఒకే చేశానని, సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందని విజయ్ తెలియచేసాడు.