తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరడానికి ముహూర్తం ఖరారైనది. హైదరాబాద్ లోని ఈ రోజు ఉదయం జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ ని కలిశారు చదలవాడ. దసరా నాడు ఆయన జనసేనలో చేరబోతున్నట్లు సమాచారం. చదలవాడ మంచి పట్టు ఉన్న నాయకుడు కావడంతో తిరుపతిలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. చదలవాడ కృష్ణమూర్తి తో పాటు తిరపతిలో భారీ ఎత్తున చేరికలు ఉండబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ మధ్య కాలంలో టీడీపీ నుండి వలసలు అధికంగా ఉండడంతో అధికార పార్టీ కొంత కలవరపాటుకు గురవుతుంది. కాగా చదలవాడ కృష్ణమూర్తి తిరుపతి నియోజకవర్గంలో 1999 జనరల్ ఎన్నికలలో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు.