టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలం నుండి టీడీపీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల తరవాత ఆనం సోదరులు కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరారు. అయితే అక్కడ సరైన గౌరవం దక్కలేదన్న ఆవేదనతో ఉన్నారు ఆనం సోదరులు. దాంతో కొంత నిరాశకు గురయ్యారు. అంతలో ఆనం వివేకా నందా రెడ్డి అనారోగ్యానికి గురై మరణించారు. ఈ నేపథ్యంలో ఆనం రాంనారాయణ రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత జగన్ తో రెండు సార్లు భేటీ కావటం జరిగింది. ఈ భేటీలో ఆనం పోటీ చేయబోయే అసెంబ్లీ సీట్ పై కూడా జగన్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల పదమూడవ తేదీన జగన్ సమక్షంలో ఆనం వైసీపీలో చేరుతారని సమాచారం.