పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, లోకేష్ బాబుపై అవినీతి ఆరోపణలతో విరుచుకుపడుతున్న విషయం తెలిసింది. ఈ ఆరోపణలు కొనసాగుతున్న వేళ చంద్రబాబు నాయుడు బిజెపి నుంచి బయటకు జరిగి, కాంగ్రెస్ పార్టీ పక్కకు వెళ్లి వచ్చే ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి ఒక అవగాహనకు వచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని బహిరంగ సభలలో తెలుగుదేశం నాయకులకు సిగ్గు లేదా అంటూ నోటికొచ్చిన బూతులు తిడుతూ అభిమానులకు విందు భోజనం అందిస్తున్నాడు.

దీనిపై చిరెత్తుకొచ్చిన తెలుగుదేశం పార్టీ సభ్యులు పవన్ కళ్యాణ్ పై రివర్స్ ఎటాక్ చేస్తూ, అసలు మేము కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేస్తే పవన్ కు వచ్చిన నష్టమేమిటని, గత ఎన్నికలలో పవన్ మాతో కలసి పని చేసి ఈరోజు పక్క పార్టీల వైపు చూడటం లేదా? అలానే తాము కూడా గత ఎన్నికలలో బిజెపితో కలసి పోటీ చేసి ఈసారి దేశ శ్రేయస్కరం కోసం కాంగ్రెస్ తో కలసి పోటీ చేస్తున్నామని తెలుగు దేశం నాయకులు పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఈసారి మాటల దాడికి టిడిపి అధినేత పార్టీలోని కాపు నేతలను రంగంలోకి దింపారు.

పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్యాయం చేసిన బిజెపితో కలసి తమపై విమర్శల దాడి చేస్తున్నాడని, పవన్ చేసినట్లు వ్యాఖ్యలు తాము చేయగలమని, తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలసిన తరువాత అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా త్వరలో ఈ పరిణామాలన్నీ సమచిపోయి అందరం కలసి పనిచేస్తామని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.