తుని తరహాలో తెలుగుదేశం హామారా నారా హామారా కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించారన్నారు ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్. సభలో జరిగిన గందరగోళానికి జగన్ తక్షణమే క్షమాపణ చెప్పాలన్న ఆయన… అధికారంలో లేనప్పుడే ఇంత దౌర్జన్యం చేస్తే అధికారంలోకి వస్తే ఇంకా ఎంత దౌర్జన్యం చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ చేసేది ప్రజా సంకల్పయాత్ర కాదని, పిక్నిక్ యాత్ర అని ఎద్దేవా చేశారు. అవినీతి పరుడైన జగన్‌కు అవినీతి గురించి మాట్లాడే అర్హత లేదన్న జలీల్ ఖాన్.. జగన్ స్వార్థపరుడన్న విషయాన్ని ప్రతి ముస్లిం అర్థం చేసుకున్నారని చెప్పారు. రానున్న 2019 జనరల్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 30 సీట్స్ లోపే వస్తాయన్నారు జలీల్ ఖాన్.