దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మరోసారి రెచ్చిపోయారు. ఈ సారి ఆయన రైతులపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం వట్లూరు జన్మభూమి మీటింగ్‌కు చింతమనేని ప్రభాకర్‌ హజరయ్యారు. ఈ సందర్భంగా వట్లూరు చెరువులో భూములు కోల్పోయిన రైతులు తమకు రావాల్సిన నష్టపరిహారం ఇప్పించాలంటూ ప్లకార్డ్స్‌ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహానికి గురైన చింతమనేని రైతులపై బూతు పురాణం ప్రారంభించారు.

దీనితో రైతులు అసలు సమస్యను పరిష్కరించకుండా తమను తిట్టటం ఏంటని వారు తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీంతో మరింత అసహనానికి గురైన చింతమనేని ఎమ్మార్వోతో చెప్పి సదరు రైతులపై ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించాడు. రైతుల మీద పోలీసులు కేసు నమోదు చేసి పొలిసు స్టేషన్ కు తరలించారు. రైతులను పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు స్టేషన్ కి వెళ్లి రైతులను పరామర్శించారు.