తెలుగుదేశం పార్టీకి చెందిన రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి నేడు అధికారికంగా వైసీపీలో చేరుతున్నారు. కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యేగా ఉన్న మేడా మల్లికార్జునరెడ్డి.. ఇప్పటికే ఓసారి జగన్‌తో సమావేశమై చర్చలు జరిపారు. అయితే ఇవాళ అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. హైదరాబాద్ లో జగన్ నివాసంలో జగన్ ను కలిసి వైసీపీలో చేరబోతున్నారు. మేడాతో పాటు 1500 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీలో చేరనున్నారని చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో మల్లికార్జున రెడ్డికి బదులు ఆయన సోదరుడు రఘునాథ రెడ్డి రాజంపేట ఎమ్మెల్యేగా పోటీచేస్తారని సమాచారం.

meda mallikarjuna reddy