ఆంధ్రప్రదేశ్ లో 2019 జనరల్ ఎన్నికల నేపథ్యంలో ఎవరికి వారు ఇప్పటి నుండే టికెట్స్ కోసం పోటీపడుతున్నారు. అధికార టీడీపీలో వేగలేక వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారు టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి. మోదుగుల గత కొద్ది రోజులగా టీడీపీలో ఇమడలేక పోతున్నారు. ప్రస్తుతం మోదుగుల వేణుగోపాలరెడ్డి గుంటూరు 2 టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పట్లో తనకు మంత్రి పదవి వస్తుదని ఆశించిన మోదుగులకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. తన నియోజిక వర్గంలోనే మోదుగుల మాట చెల్లుబాటు కావడం లేదు. మిర్చి యార్డ్ తన నియోజికవర్గంలోనే ఉంటె తాను చెప్పిన వాళ్లకి ఆ పదవి రాలేదు.

దీనితో ఎంతో కాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మోదుగుల వైసీపీ జండా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. మోదుగుల గుంటూరు వైసీపీ ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. మోదుగుల వైసీపీలోకి చేరతాడు అనే అంచనాలు ఇప్పటివి కావు. గత ఎన్నికల ముందు కూడా మోదుగుల వైసీపీలో చేరతాడనే ప్రచారం జరిగింది. అయితే అది జరగలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రచారమే జరుగుతోంది. మోదుగుల 2009 ఎన్నికలలో టీడీపీ తరుపున నరసరావు పేట ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తరవాత 2014 ఎన్నికలలో గుంటూరు 2 ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు.