అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాజాగా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు దాడి చేసారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె సమీపంలో రైతులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన జేసీ… టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా వెధవలని ప్రకటించారు. ఈ సందర్భంలోనే అధికార పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో పాటు కమ్యూనిస్టు పార్టీల నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాను అసెంబ్లీకి వెళ్లక ముందు కమ్యూనిస్టులంటే చాలా మంచివారనే అభిప్రాయం ఉండేదన్న జేసీ… కానీ కమ్యూనిస్టులంత దొంగలు ఎక్కడా లేరని ఆ తర్వాత తెలుసుకున్నానన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులంతా పనికిరాని వెధవలు కాబట్టే.. అందుకే ఏ పథకం కూడా సరిగా అమలు కావడం లేదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తుంటే వాటిని తిరిగి బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని జేసీ చెప్పారు. చంద్రబాబు ద్వారా తనకు ఎలాంటి లబ్ది కలగలేదన్నారు. కాగా, చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాల్లో చంద్రన్న బీమా పథకం ఒక్కటే బాగుందన్నారు. జేసీ వ్యాఖ్యలతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తదితర టీడీపీ నేతలు నివ్వెరపోయారు. సీఎం వల్ల నాకు ఎలాంటి లబ్ధి కలుగలేదన్న ఆయన… నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు.. ఇచ్చినా తట్టుకోలేడన్నారు.

Tags: Jc Diwakar Reddy, TDP, Chandrababu, Anathapur, CPM