వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలియచేసాడు. తాము ఎవరితో పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని కాల్వ తెలియచేసాడు. కాల్వ శ్రీనివాసులు లాంటి వారు ఈ మాటలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేదు. చంద్రబాబు నాయుడేమో బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం తహ తహ లాడుతున్న విషయం అందరికి తెలిసిన విషయమే. కొన్ని కూటములు కలసి ఫెడరల్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి, ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు తీసుకునేలా ఇప్పటికే చర్చలు కూడా ముగిశాయని బయట కోడై కూస్తుంటే ఈ సమయంలో కాల్వ శ్రీనివాసులు ఇలాంటి ప్రకటన చేసి ఎవరని నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడో అర్ధం కావడం లేదు. కానీ తెలుగుదేశం ఒంటరిగా వెళ్లి గెలిచిన చరిత్ర లేదని గత చరిత్ర తెలియచేస్తుంది. మరి ఒంటరిగా వెళ్ళాలి అని కాల్వ మనస్సులో ఉన్నా, చంద్రబాబు నాయుడు అండ్ చిన్న బాబు మనస్సులో ఏముందో కూడా తెలుసుకోవాలి కదా.