కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో గులాంనబీ ఆజాద్‌ పరామర్శించారు. సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావొచ్చన్నారు. ఈ రోజు సీఎంగా కేసీఆర్‌ ఉన్నారని రేపు ఆ స్థానంలో రేవంత్ రెడ్డి ఉండవచ్చన్నారు.

అర్థరాత్రి రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేసినందుకు ఆయన కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని ఆజాద్‌ డిమాండ్‌ చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో కలిసి కీలక పాత్ర పోషించి.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన రేవంత్ రెడ్డిని ఏ ప్రాతిపదికన సీఎంని చేస్తారని.. కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.