తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తెరాస పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. తెలంగాణలో తెరాస కు రానున్న ఎన్నికల్లో 85 సీట్లు తథ్యమని ఇటీవల టీమ్‌ఫ్లాష్, వీడీఏ అసోసియేట్స్, సీవోటర్, టైమ్స్‌నౌ సంస్థలు నిర్వహించిన సర్వేలను క్రోడీకరిస్తూ మంగళవారం ఎన్డీటీవీ వెల్లడించిన పోల్ ఆఫ్ ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో తేలింది. మొత్తం 119 సీట్లలో తెరాస ఏకంగా 85 సీట్లలో విజయం సాధించనుండగా… కాంగ్రెస్‌ పార్టీ కేవలం 18 సీట్లతో రెండో స్థానానికి పరిమితం కానుంది.

తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుకు 60 స్థానాలు అవసరం. అంటే సాధారణ మెజార్టీ కంటే అధిక స్థానాలను తెరాస కైవసం చేసుకోబోతుందన్న మాట. బీజేపీకి ఐదు, ఎంఐఎం కు 7 స్థానాలు లభిస్తాయని పోల్ అఫ్ ఒపీనియన్ పోల్స్ స్వష్టం చేసింది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కెసిఆర్ మరో సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడం ఖాయం అంటున్నాయి.