మహాకూటమి పేరుతో తెలంగాణాలో కేసీఆర్ ను పడగొట్టడానికి అన్ని పార్టీలు సిద్మవుతున్నాయి. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు సోనియా గాంధీని అనరాని మాటలు అని ఈరోజు సోనియా గాంధీ ఒక దేవత అన్నట్లు వ్యాఖ్యానించడంతో చాల మంది తెలుగుదేశం నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఎన్టీఆర్ టిడిపి స్థాపించే సమయంలోనే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, కాంగ్రెస్ పార్టీని అత్యంత దారుణంగా విమర్శించేవారు. కానీ ఈరోజు అదే టిడిపి వారితో కలవడంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్స్ మహాకూటమికి వ్యతిరేకంగా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది.

ఈ కూటమి గొడవ ఒకవైపు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీని ఎలా అయిన అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నాయకులకు సర్వేలు టెన్షన్ కు గురిచేస్తున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ బారి మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోనున్నారని, సీట్ల సంఖ్యను కూడా పెంచుకొని దాదాపు 80 స్థానాలు కైవసం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 20 సీట్ల లోపే కైవసం చేసుకుంటుందని, గత ఎన్నికల కన్నా తక్కువ సీట్లను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోనుందన్న విషయం కూడా ఈ సర్వేలో తేలడంతో కాంగ్రెస్ పరిస్థితి కుడితో పడ్డ ఎలుక మాదిరిగా తయారైనది.

కేసీఆర్ ఇప్పటికే నియోజకవర్గాల వారీగా టిఆర్ఎస్ పార్టీ తరుపున నిలబడే అభ్యర్థులను ఎంపిక చేసుకొని, అసమ్మతులను బుజ్జగించే పనిలో ఉంటె మహాకూటమి పేరుతో ఏర్పడిన కాంగ్రెస్ మరియు ఇతర చిన్న చితక పార్టీలు సీట్ల సర్దుబాటులోనే తలకుమించిన భారాన్ని నెత్తికెత్తుకొని మోయలేని స్థితిలో ఉన్నాయి. ఇక అభ్యర్థుల ఎంపిక తరువాత మహాకూటమిలో జరిగే రచ్చతో మరికొంత వారికి డ్యామేజ్ జరిగితే, కేసీఆర్ కు ప్లస్ గా మారనుంది. ఈ పరిణామాలతో కేసీఆర్ తమ పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం చేస్తూ గెలుపై దృష్టిపెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.