తెలుగుదేశం, జనసేన, బిజెపి కలసి పోటీ చేయడం వలనే తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికలలో స్పష్టమైన మెజారిటీ వచ్చిందని కాదనలేని విషయం. మోదీ హావ దేశ వ్యాప్తంగా బలంగా వీస్తున్నప్పుడు, ఆ గాలికి పవన్ కళ్యాణ్ కూడా కలసి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండటంతో ఒక రకంగా వైసిపి పార్టీ గోదావరి జిల్లాలతో పాటు, ఉత్తరాంధ్రలో తుడిచిపెట్టుకుపోయింది. కానీ నాలుగు సంవత్సరాల తరువాత ఈ మూడు పార్టీలు ఎవరి దారి వారు చూసుకొని రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయ పార్టీలంటేనే రాజకీయాలు చేయడం, ఎవరకి వారు తమ మాటల వాగ్ధాటితో పక్క పార్టీలపై విరుచుకుపడుతున్నారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు వైసీపీతో కలసి ఉండి ఇప్పుడు వేరు కాపురం పెట్టి చంద్రబాబు, లోకేష్ పై రోజుకొక విమర్శ చేస్తూ వార్తలలో నిలుస్తున్నాడు. ఇన్ని రోజులు భరిస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇక పవన్ కళ్యాణ్ పై సహించేది లేదని తన పార్టీ నాయకులకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు కాపు నేతలతో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసి చేయంట్లు చేపిస్తున్న, పవన్ చంద్రబాబు – లోకేష్ పై లేని పోనీ విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీని పూర్తిగా బద్నామ్ చేయడానికి కంకణం కట్టుకున్నట్లు కనపడుతుందని తెలుగుదేశం పార్టీ ఒక అభిప్రాయానికి వచ్చింది.

దీనితో పవన్ కళ్యాణ్ పై పార్టీలో ఎవరైనా విమర్శలు చేయవచ్చని, వైసిపి పార్టీపై ఎలాంటి దాడి కొనసాగిస్తామో పవన్ కళ్యాణ్ మీద కూడా అలంటి దాడే కొనసాగించాలని, ఎలాంటి వాటికి ఉపేక్షించేది లేదని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటి వరకు ఆచితూచి మాట్లాడటానికి కారణం పవన్ కళ్యాణ్ మరల తెలుసుకొని వచ్చే 2019 ఎన్నికలలో మాతో కలసి పోటీ చేస్తాడేమో అని ఆశాభావం వ్యక్తం చేయడం వలన చూసి చూడనట్లు వదిలేసినట్లు తెలుస్తుంది. కానీ పవన్ కళ్యాణ్, బిజెపి మీద ఎలాంటి విమర్శలు చేయకుండా అంత తెలుగుదేశం వారిదే తప్పని అవినీతి అంత చంద్రబాబు, లోకేష్ చేసారని మాట్లాడటంతో టిడిపి చివరకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇక రేపటి నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులు వేసే పంచులు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఎలా ఎదుర్కొంటాడని ఆసక్తి నెలకొంది. జనసేనలో ఇప్పటి వరకు సరైన స్పోకెన్ మ్యాన్ లేకపోవడం అంత పవన్ కళ్యాణ్ ఒక్కడే విమర్శలు చేస్తూ, తాను ఒక్కడే నాయకుడిలా జనసేన పార్టీలో ఉండటం కూడా ఇప్పుడు జనసేన పార్టీ వారికి కొంత ఇబ్బందిగా మారింది. ఎన్నికలు దగ్గర కోస్తున్న కొద్ది టిడిపి తమ అస్త్రాలను రెడీ చేసుకొని ఎదురు దాడి చేయడంలో అందే వేసిన చెయ్యిగా మనం ప్రతి ఎన్నికలలో చూస్తూనే ఉన్నాం.

Tags : Telugudesam, Janasena, Pawan kalyan, Chnadrababu Naidu, Bjp