కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల లొల్లి నడుస్తూనే ఉంది. టిజి భరత్ కు కాకుండా ఈసారి కర్నూల్ ఎమ్మెల్యే టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డికే అని లోకేష్ చెప్పడంతో వివాదం రాజుకుంది. దీనిపై ఈరోజు టిజి భరత్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు కర్నూల్ జిల్లా నుంచి పోటీ చేయాలనీ అలా పోటీ చేస్తే కర్నూల్ జిల్లాలో ఉన్న 14 సీట్లు తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంటుందని తెలియచేసారు.

ఒక వేళ చంద్రబాబు నాయుడు కర్నూల్ నుంచి పోటీ చేయకపోతే కర్నూల్ జిల్లాలో గెలిచేవారికే టికెట్స్ ఖరారు చేయాలనీ టిజి భరత్ చంద్రబాబుకి ఫిట్టింగ్ పెట్టాడు. దీనితో చంద్రబాబు వచ్చే ఎన్నికలలో కర్నూల్ జిల్లా నుంచి పోటీ చేయాలనుకున్న తన ఆశను చంపుకోలేకపోతున్నాడని, ఎట్టి పరిస్థితులలో కర్నూల్ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం తరుపున పోటీ చేస్తానని సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. ఒక వేళ ఎస్వీ మోహన్ రెడ్డికి కాకుండా చంద్రబాబు టిజి వెంకటేష్ కు కర్నూల్ అసెంబ్లీ సీటు కేటాయిస్తే చిన్న బాబు లోకేష్ అలక పాన్పు ఎక్కుతాడని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇంకొన్ని రోజులు ఆగవలసి ఉంది.