దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతల కోసం అనేక పధకాలను అమలు చేశారన్నారు టీ పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో రైతు రాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. అందరూ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యం కాదని చెప్పిన వైఎస్ దానిని సాధ్యం చేసి చూపించారన్నారు.

నాడు ఎంతో మంది రైతులు దీనస్థితిలో ఉంటె వారందరికీ ఒకేసారి రైతు రుణమాఫీ చేసిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే నన్నారు. ఈ రోజు మద్దతు ధరలేక ఎంతో మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని.. వారి కోసం 5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధరపై రైతులకు బోనస్ ఇస్తామన్నారు ఉత్తమ్. అలాగే వైఎస్సార్ స్పూర్తితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకేసారి రైతులందరికీ రుణ మాఫీ చేసి చుపిస్తామన్నారు.