ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి విద్యార్థులతో కలసి పరీక్ష రాశారు. దూరవిద్యలో న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తూ.. క్రమం తప్పకుండా సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. తాజాగా తోటి విద్యార్థులతో కలిసి ఆయన హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లాలో పరీక్షలు రాశారు. హన్మకొండలోని ఆదర్శ్ లా కాలేజీలో ఆయన జీవన్‌రెడ్డి ఎల్‌ఎల్‌ఎం అభ్యసిస్తున్నారు.

ఎల్‌ఎల్‌ఎం విద్యలో భాగంగా ఆయన ప్రస్తుతం మూడవ సెమిస్టరు పరీక్షలకు హాజరవుతున్నారు, సోమవారం పరీక్షరాసిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది రెండు సెమిస్టరు పరీక్షలు రాసి పాస్ అయ్యానని.. ఇప్పుడు మూడవ సెమిస్టరు పరీక్షకు హాజరయ్యానన్నారు. పరీక్షలకు హాజరుకావడం చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందన్న జీవన్‌రెడ్డి.. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు గుర్తుకువచ్చాయని అన్నారు.

jeevan reddy