తెలంగాణ సీఎం కెసిఆర్ జనరల్ ఎలక్షన్స్ లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు తెరాస ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు రేడియో టవర్ ఎక్కారు. శుక్రవారం ఎల్బీనగర్లోని చింతల్ కుంటలోని రేడియో టవర్ ను ఎక్కిన యువకులు శంకరమ్మకు టికెట్ ఇస్తేనే కిందకు దిగుతామని స్పష్టం చేశారు. రెండు గంటల నుంచి ఇద్దరు యువకులు రేడియో టవర్ పైనే ఉండటంతో అక్కడ స్థానికులు భారీగా గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఉద్యమంలో ఆమరణ దీక్షకు సిద్దమైన కేసీఆర్‌ అరెస్ట్‌ను నిరసిస్తూ… నల్గొండ జిల్లాకు చెందిన శ్రీకాంతాచారి హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.