మాజీ ఎంపీ ఉండవల్లి అఖిలపక్ష సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అఖిలపక్ష సమావేశానికి దాదాపు రాజకీయ పార్టీలన్నీ హాజరువుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉండ‌నుంది. టీడీపీ హాజరు ఉంటే తాము ఈ సమావేశంలో భాగస్వామ్యం కాలేమని వైఎస్సార్ సీపీ తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ తెలుగుదేశంతో వేదిక పంచుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది.

ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఈ సమావేశానికి వైసీపీ తప్ప అన్ని పార్టీలు హాజరవుతున్నాయని ప్రకటించారు. ఇక ఈ స‌మావేశంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాన్ని చర్చించబోతున్నామని.. రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసమే ఈ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు. కాగా ఈ క్ర‌మంలో టీడీపీ త‌రుపున మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరుకానున్నారని స‌మాచారం.