ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొంత చిక్కులలో ఇరుకునట్లు కనపడుతుంది. గత ఎన్నికలలో ఓటమి చెందిన తరువాత అఖిలేష్ మాజీ సీఎం హోదాలో నివసించిన భవనాన్ని సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ఖాళీ చేసిన సంగతి తెలిసిందే. ఆ భవంతిని ఖాళీ చేసే సమయంలో అతను నివసించిన ఇంటిలోని ఫ్లోరింగ్, శానిటేషన్ పరికరాలు, తదితర సామాగ్రిని తీసుకుపోవడంతో పాటు భవనాన్ని బాగా డ్యామేజ్ చేశారట.

దీనిపై అధికారులు ప్రభుత్వానికి డ్యామేజ్ పై ఒక నివేదిక ఇచ్చారు. అఖిలేష్ తీసుకువెళ్లిన సామాను, బిల్డింగ్ డ్యామేజ్ పై ఆర్.అండ్.బి చీప్ లెక్కలు కట్టి అఖిలేష్ పది లక్షల వరకు కట్టవలసి ఉంటుందని తెలియచేసారు. కానీ అఖిలేష్ మాత్రం ఇదంతా దృష్ప్రచారమని అలాంటిదేమి లేదని తెలియచేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పలు సెటైర్లు పేలుతున్నాయి.