కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలిశారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉన్నాయి. ఈ సమావేశంలో రాధా వెంట అత్యంత సన్నిహితులైన కాపు నాయకులూ ఉన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అడపా వెంకటరమణ, పాలేటి చంటి, ఎంవీ నారాయణరెడ్డి, కొడాలి నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ పొట్లూరి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.