వైసీపీలో విజయవాడ సెంట్రల్ టికెట్ ను మల్లాది విష్ణుకి కేటాయించారు జగన్. దీనితో వంగవీటి రాధా సెంట్రల్ టికెట్ తనకు కావాల్సిందే అని పట్టు పట్టారు. రాధా విషయంలో కొంత సందిగ్దత ఏర్పడింది. సెంట్రల్ టికెట్ తనకు ఇవ్వక పోవడంతో రాధా తన అనుచరులతో కలసి సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఒకానొక దశలో ఆయన జనసేనలోకి వెళ్లతారని ప్రచారం జరిగింది. వెంటనే అప్రమత్తం అయినా వైసీపీ అధిష్టానం ఆయనకు మచిలీపట్టణం పార్లమెంట్ సీటు కేటాయిస్తామని తెలిపింది. పైగా మచిలీపట్టణం పార్లమెంట్ కు రాధా ను ఒప్పించినట్లు సమాచారం. పార్టీ మారిన ఉపయోగం ఉండక పోవచ్చని భావించిన రాధా.. పార్టీ మారే ఆలోచనను విరమించుకున్నారట.