పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తు విషయమై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మీదకు దూషణలకు దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలిసే బదులు మరో సారి తన ఇంటికి వచ్చి నాకు వచ్చే ఎన్నికలలో అండగా ఉండమంటే ఉంటాను కదా అంటూ చంద్రబాబు నాయుడుని కాస్త తక్కువ చేసేలా మాట్లాడారు. దీనిపై ఈరోజు వర్ల రామయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నాడని, పవన్ బిజెపి అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు తప్ప, జనసేన అధినేతగా మాట్లాడటం లేదని వర్ల అన్నారు.

పవన్ కళ్యాణ్ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టి నేరుగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే తప్పు లేదు గాని, తాము కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది వచ్చిందా అని అన్నారు. పవన్ కళ్యాణ్ బిజెపి మౌత్ పీస్ లా మాట్లాడుతున్నారని, ప్రధాని మోదీ అమ్ముల పొదిలిలో పవన్ కళ్యాణ్ ఒక అస్త్రం మాత్రమే అని, తాము కాంగ్రెస్ తో కలసినప్పుడు పవన్ కళ్యాణ్ కు వచ్చిన ఇబ్బంది చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినప్పుడు రాలేదా అని వర్ల రామయ్య పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.