ఎవరో ఒకరు అసహనం చెందారంటే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది. కానీ రెండు వైపులా అసహనం చెందటమేమిటో అర్ధం కావడం లేదు. నిన్న జరిగిన రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎంపికైన హరివంశ నారాయణ గౌరవార్ధం ఈరోజు ఇచ్చిన అల్పాహార విందుకి కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారట. దీనిపై వెంకయ్య అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.

మరో వైపు కాంగ్రెస్ సభ్యులు మాత్రం రఫెల్ ఒప్పందం, ఎస్పీ, ఎస్టీ వంటి వాటిపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.  అందుకని కాంగ్రెస్ సభ్యులు అల్పాహార విందుకు హాజరవ్వలేదని తెలుస్తుంది. కానీ లోతుగా ఆలోచిస్తే ప్రతిపక్షాలన్నిటిని కూడా కట్టి ఎలాగైనా రాజ్యసభ ఉపాధ్యక్ష పదవి కైవసం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ ప్లాన్ బెడిసికొట్టడంతోనే ఈ అల్పాహార విందుకు హాజరవ్వలేదేమో అనిపిస్తుంది.