తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పోస్టర్లను సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ వి.హనుమంత రావు చించి వేశారు. హైదరాబాద్ నాచారంలోని ఆర్టీసీ బస్సులపై కెసిఆర్ ఫొటోలు ఉండటం చూసిన ఆయనకు కోపం వచ్చినది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఈ పోస్టర్లు ఎందుకున్నాయన్న ఆయన.. బస్సు దగ్గరకు వెళ్లి వాటిని చించి వేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆయన.. కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలందరూ సహకరించాలన్నారు వి హనుమంత రావు.