ఏపీ మంత్రి నారా లోకేష్ ను తాగునీటి సదుపాయం లేదని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం బియ్యపుతిప్పలో మహిళలు ఖాళి బిందెలతో అడ్డుకున్నారు. సుమారు 200 కుటుంబాలకు పైగా నివసిస్తున్న తమ కాలనీలో తాగునీటి సదుపాయం లేదని మంత్రి వద్ద ధ్వజమెత్తారు. పూర్తిగా ఉప్పునీటి మయమైన తమ ప్రాంతానికి పక్క గ్రామమైన వేములదీవి నుంచి పైపులైను ద్వారా నీరు వస్తున్నప్పటికీ.. తరుచుగా పైపులైనులు పగిలి నీరు రావటలేదని తెలియజేసారు. అదికూడా రెండు రోజులకోసారి కేవలం అరగంట పాటు మాత్రమే ఇస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో తాగునీటి అవసరాలు తీరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాన్వాయ్ ని ముందుకు పోనిచ్చారు.

lokesh