మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటనలో ఉన్నారు. విశాఖలోని మధురవాడ ఐటీ సెజ్‌ హిల్‌-2లో సీఈఎస్‌ సంస్థ కార్యాలయాన్ని శుక్రవారం ఉదయం మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… విశాఖపట్నం ఐటీ రంగానికి కేరాఫ్ గా మారబోతుందన్నారు. మొదటి దశలో వంద ఎకరాల్లో ఐటీ నిర్మాణం జరగనున్నట్లు తెలిపారు. నాలుగు దశల్లో ఐటీ పార్క్ అభివృద్ధికి 700 ఎకరాలు కేటాయించామన్న ఆయన.. ఐటీ పార్క్‌లో 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. వేగంగా మౌలిక వసతుల కల్పన జరుగుతోందన్న లోకేష్… రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ ఇతర మౌలిక వసతుల కల్పన సెప్టెంబర్ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.