దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ బయోపిక్ పేరుతో “యాత్ర” సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి దాదాపుగా చివరి దశకు వచ్చింది. గత వారమే మమ్మూటీ కి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒక సాంగ్ తో పాటు చిన్న చిన్న సీన్స్ బ్యాలెన్స్ మాత్రం మిగిలి ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతుంది.

యాత్ర సినిమా మొదలైనప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. తరువాత సినిమాను ముందుకు జరిపి డిసెంబర్ 21న తీసుకురావాలని నిర్ణయించారు. దానికి తగట్లు మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసుకొని చివరి దశకు చేరడంతో పాటు, ఫస్ట్ ప్రింట్ 21కి సిద్ధంగా ఉంటుంది. కానీ మరలా ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో సంక్రాంతికే సినిమాను రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచనలో పడినట్లు కనపడుతుంది.

సంక్రాంతి సీజన్ అయితే ఎన్ని సినిమాలు వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదని, వైఎస్ఆర్ లాంటి మాస్ లీడర్ సినిమా సంక్రాంతి సీజన్ అయితేనే బాగుంటుందని ఏవేవో డిస్కషన్స్ జరుగుతున్నట్లు కనపడుతుంది. ఈ చిత్రంలో జగపతి బాబు, పోసాని కృష్ణ మురళి, జయసుధ ఇలా ప్రముఖంగా యాక్టర్ లు నటిస్తున్నారు. 70 ఎంఎం బ్యానర్ పై విజయ్ చిల్లా నిర్మిస్తుండగా మహి వి.రాఘవ దర్శకత్వం వహిస్తున్నారు.