కేసీఆర్ ఎన్నికలలో గెలవడానికి ఒంటరిగా పోటీకి సిద్ధమైతే, ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ మాత్రం టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు మహాకూటమి పేరుతో అన్ని పక్షాలను ఏకం చేసి ముందుకు వెళ్తుంది. ఈ పరిణామాలతో కేసీఆర్ కు కొంత ఆందోళన పట్టుకున్నా, సెటిలర్స్ ను కొంత మేర తన వైపు తిప్పుకోవడంలో సఫలమయ్యారు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపిన కాపులు ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీపై కొంత మేర మొగ్గు చూపారు. ఇక అలానే వైసిపి పార్టీ కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలో ఇలబెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, మరియు వైఎస్ తనయుడు వైఎస్ జగన్ ను జైలు పాలు చేయడానికి ప్రధాన కారణమైన చంద్రబాబు నాయుడుతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం నచ్చకపోవడంతో నేరుగా వైసిపి అధిష్టానం టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని  చెప్పకపోయినా వైఎస్ సానుభూతిపరులు, వైసిపి పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ సెటిలర్స్ నేరుగా బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలియచేస్తున్నారు.

ఇక ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ ఈరోజు ఉదయం వైసిపి పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీ ఆత్మసాక్షికి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. మరోవైపు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనసేన అభిమానుల కోరిక మేరకు తమ మద్దతు ఏ పార్టీకి అనేది 5వ తారీఖున తెలియచేస్తామని చెప్పారు. రేపు పవన్ కళ్యాణ్ కూడా తన మద్దతు టీఆర్ఎస్ అని చెప్పడంతో పటు, తెలుగుదేశం పార్టీని ఓడించాలని పిలుపునిస్తారని తెలుస్తుంది. వైసిపి – జనసేన పార్టీలు తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో పాటు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకి తెలంగాణ సాక్షిగా దెబ్బ కొట్టి, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ సత్తా చూపించడానికి సిద్ధమవుతున్నారు.

వైఎస్ జగన్ – పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోవడంలో కేసీఆర్ ఆలోచన, కేటీఆర్ వ్యూహాత్మకమైన ఎత్తుగడ సఫలీకృతమై  టీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు బారీగా పెంచుకోడంతో పాటు టీఆర్ఎస్ పార్టీకి మరిన్ని సీట్లు సాధించడానికి తోడ్పాటుని అందిస్తారనడంలో అతిశయోక్తి లేదు.  

 

కేసీఆర్ పొలిటికల్ ప్రొఫైల్    గజ్వెల్ ఎన్నికల ఫలితాలు