మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తనకు భెదిరింపులు వస్తున్నాయని భద్రత పెంచాలని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ కు లేఖ రాశారు. అనేక మంది తనను టార్గెట్ చేస్తున్నారన్న ఆర్కే.. ఓటుకు నోటు కేసు, సదవర్తి భూముల వ్యవహారంపై న్యాయ పోరాటం చేయటం వల్ల తనకు వరుసగా భెదిరింపులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాల మీద ఎమ్మెల్యే ఆర్కే న్యాయస్థానాల్లో పోరాటాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి అక్రమ నివాసం, రాజధాని భూసేకరణ ఇంకా అనేక అంశాలపై పోరాటాలు చేస్తున్నారు ఆర్కే. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియా నుంచి బెదిరింపులు లేఖలు, హతమారుస్తామంటూ ఫోన్‌కాల్స్‌ ఆయనకు వచ్చాయి. మావోయిస్టుల పేరిట కూడా ఇటీవల బెదిరింపుల లేఖలు వస్తున్న నేపథ్యంలో తన భద్రతను పెంచి.. కనీసం టూ ప్లస్‌ 2 (2+2) గన్‌మెన్‌ సెక్యూరిటీ అందజేయాలని ఆయన లేఖలో కోరారు. లేఖను స్వయంగా తీసికెళ్ళి డీజీపీకి అందజేశారు ఆర్కే.