వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన “కోడి కత్తి శ్రీను” దాడికి సంబంధించి వైసిపి నేతలు కోరినట్లు ఎట్టకేలకు కేసు ఎన్ఐఏ చేతికి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తూ నిందుతుడు శ్రీనివాస్ ను వైజాగ్ నుంచి హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న ఎన్ఐఏ ఆఫీస్ కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి తెలుగుదేశం అధినేత మరీ ఎక్కువ భయపడుతున్నట్లు తన వ్యాఖ్యలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. చంద్రబాబు నాయుడుకి ఎన్ఐఏకు కేసు అప్పగించడం వలన వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్ధం కావడం లేదు.

ఈ కేసుని ఎట్టి పరిస్థితులలో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజాలు వెలుగు తీయాలని ఎన్ఐఏ అధికారులు పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదికి లేఖ రాస్తూ జగన్ కేసుని చాల పద్దదిగా చుపిస్తున్నారని, అది చాల చిన్న కేసు అని అసలు ఏపీ ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తుంటే దీనిని ఎన్ఐఏ కు అప్పచెప్పడం భావ్యం కాదని, ఎన్ఐఏ అధికారులను రీకాల్ చేయాలని కోరారు. మరో వైపు చంద్రబాబు అనూహ్ట్రాగానం ఢిల్లీ లెవెల్ లో వారు చేయాల్సిన పనులలో వారు నిమగ్నమై ఉన్నారు.

చంద్రబాబు నాయుడుకి ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ గురించి తెలియంది కాదు, వారు ఒక్కసారి కేసుని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న తరువాత వైజాగ్ నుంచి హైదరాబాద్ తరలించిన నిందుతుడిని రేపో మాపో ఢిల్లీ లేదా ముంబై తరలించినా ఆశ్చర్యం లేదని తెలుస్తుంది. వైజాగ్ లో అయితే తమకు సహకారం తక్కువ అందుతుందని భావించిన అధికారులు హైదరాబాద్ తరలించారు. కానీ చంద్రబాబు నాయుడు బృందం ఢిల్లీ లెవెల్ లో చేస్తున్న ప్రయత్నాలతో ఎన్ఐఏ అధికారులను ప్రలోభ పెట్టగలరా లేక మోదీ ముందు మరోసారి సాగిలా పడి కేసుని తప్పుదోవ పట్టించగలరా త్వరలోనే తేలుతుంది. చంద్రబాబు నాయుడు పడుతున్న భయం చూస్తుంటే వైఎస్ జగన్ పై జరిగిన దాడిలో పెద్ద లెవెల్ లోనే ఏమైనా ప్లాన్ జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి.