ఈ రోజు అనంతపురంలో జరిగే బూత్ కమిటీల సమావేశంలో పాల్గొన్నారు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు దగ్గరబడే కొద్ది పాలకులుగా ఉన్నవారి అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని అన్నారు. పెద్ద ఎత్తున బోగస్ ఓట్లు చేర్చారని, అలాగే వైసీపీ అభిమానుల ఓట్లను తొలగించారని,ఈ రెండు విషయాలో జాగ్రత్త వహించాలన్న జగన్.. చంద్రబాబు ఆడే డ్రామాలు ఇన్ని అన్ని కాదన్నారు.

యెల్లో మీడియాతో జాగ్రత్తగా ఉండాలన్న జగన్.. ఈనాడు,ఆంద్రజ్యోతి, టివి 5 తో పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు చేస్తున్న అక్రమాలకూ వీరంతా అండగా ఉంటున్నారని.. బూత్ కమిటీ సభ్యులకు జగన్ సూచించారు.