లండన్ టూర్ ముగించుకుని వచ్చిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. ఈరోజు తన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టాడు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న కొత్త ఇంటిలోకి ఉదయం గృహప్రవేశం చేశారు. ఉదయం 8.19 గంటలకు వైఎస్‌ జగన్‌, భారతి దంపతులు నూతన గృహంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యలు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ హాజరు కాగా.. వైఎస్సార్‌సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌ రెడ్డి, తలశిల రఘురాంలు పాల్గొన్నారు.

గృహ ప్రవేశం ఉండడంతో ఈ రోజు ఉదయమే హైదరాబాద్ నుండి తాడేపల్లి చేరుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌ పార్టీ నేతల సమక్షంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇక పార్టీ కార్య కలాపాలన్నీ కూడా తాడేపల్లి నుండే జరగబోతాయని వైసీపీ నేతలు చెపుతున్నారు.

jagan new home