వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత సంవత్సర కాలంగా చేస్తున్న పాదయాత్ర తుది దశకు చేరుకుంది. మరొక్క రోజు మాత్రమే వైఎస్ జగన్ పాదయాత్ర మిగిలి ఉంది. రేపు వైఎస్ జగన్ తన పాదయాత్రను వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ షర్మిల ఎక్కడైతే పాదయాత్రను ముగింపు పలికారో అదే ఇచ్ఛాపురం ప్రాంతంలో తన పాదయాత్రకు ఎండ్ కార్డ్ వేయనున్నారు. ఇక ఇదే తరుణంలో వైఎస్ జగన్ సాక్షి, టీవీ9 మీడియాలకు ఇంటర్వూస్ ఇచ్చారు. సాక్షి టివికి ఇంటర్వ్యూ ఇచ్చినా దానిని ప్రజలు పెద్దగా పరిగణలోకి తీసుకోరు. కారణం అది వైఎస్ జగన్ మాతృ సంస్థ కావడమే. కానీ టీవీ9 అంటే మొదటి నుంచి వైసిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తుంటారు. అలాంటి ఛానల్ కు వైఎస్ జగన్ ఇంటర్వ్యూ అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు.

వైఎస్ జగన్ ను టీవీ9 యాంకర్ రజనీకాంత్ దాదాపుగా గంట పాటు ఇంటర్వ్యూ చేసాడు. ఆ ఇంటర్వ్యూ లో వైఎస్ జగన్ డొంక తిరుగుడు మాటలు లేకుండా… ప్రశ్నలు దాటవేయకుండా… అడిగిన ప్రశ్నను తప్పించుకోవడానికి బుకాయించకుండా అడిగిన ప్రతి ప్రశ్నకు అసహనం వ్యక్తం చేయకుండా సహనంతో ఇచ్చిన సమాధానాలు వైసిపి కార్యకర్తలని కాకుండా సామాన్య ప్రజలను కూడా బాగా ఆకట్టుకుంది.

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు వారికి సంబంధించిన మీడియా సంస్థలకే ఇంటర్వ్యూ ఇస్తూ, కాలాన్ని గడుపుతున్న క్రమంలో దైర్యంగా నిత్యం తనకు వ్యతిరేకంగా పనిచేసే మీడియా వారికి ఇంటర్వ్యూ ఇచ్చి యాంకర్ ను నీళ్లు నమిలేలా చేసాడు. ఒక పరిణితి చెందిన వ్యక్తిగా హుందాగా తాను చెప్పదలచుకున్న సమాధానంలో సోది లేకుండా వివరణాత్మకంగా వివరించి 2019 ఎన్నికలలో తాను గెలిచి ఎందుకు సీఎం సీటుని అధిష్టించాలనుకుంటున్నానో, తన వల్ల రాష్ట్రంలో జరిగే మార్పు ఏవిధంగా ఉంటుందో తెలియచేసాడు.

ఇక వైఎస్ జగన్ టీవీ9కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు యూట్యూబ్ లో ట్రెండీగా మారింది ఇండియాలోనే టాప్ 10 యూట్యూబ్ వీడియోస్ లో వైఎస్ జగన్ ఇంటర్వ్యూ నిలవడంతో వైసిపి అభిమానులు మంచి జోష్ మీద ఉన్నారు. ఈ దెబ్బతో ఇప్పటి వరకు వైఎస్ జగన్ గురించి తప్పుగా ఆలోచిస్తున్న పచ్చ మీడియాలో కూడా మార్పు వచ్చి వైఎస్ జగన్ రాష్ట్రము కోసం తాను పడుతున్న శ్రమలో బాగస్వామ్యులుగా మారి వైఎస్ జగన్ కు అండగా నిలవకపోయినా, తప్పుడు వార్తలైనా ప్రసారం చేయకుండా ఉంటారేమో చూడాలి.