ఒంగోలు పార్లమెంట్ స్థానం విషయంపై ఇప్పటికే వైసిపి పార్టీ నేత స్వయానా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అలకబూనాడన్న వార్త ఇప్పుడు వైసీపీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. జగన్ విజయవాడ ఇంటి గృహప్రవేశానికి కూడా వైసిపి సుబ్బారెడ్డి కుటుంబం దూరంగా ఉండటానికి కూడా జగన్ కు – వైవీకి మధ్య అంతరాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి.

కానీ వైఎస్ జగన్ మాత్రం గత ఎన్నికలలో చేసిన తప్పులు చేయకుండా ఎవరు ఏమనుకున్నా, మొహమాటాలు పక్కన పెట్టి సరైన నాయకుడిని నిలబెట్టి ఒంగోలు పార్లమెంట్ స్థానం కింద ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడానికి పక్కాగా పధకం రచించాడు. వైవీ సుబ్బారెడ్డి మాత్రం తనపై ఓడిపోయిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి వచ్చే ఎన్నికలలో వైసిపి నుంచి పార్లమెంట్ స్థానం ఎలా కట్టబెడతారన్న వాదనకు బలం లేకుండా పోయింది.

ఒంగోలు ప్రాంతంలో మొదటి నుంచి వైసీపీ పార్టీ చాల పటిష్టంగా ఉంది. కానీ గత ఎన్నికలలో ఆ స్థానం నుంచి జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నిలబెట్టడంతో చచ్చి చెడి 15 వేల ఓట్లతో బయటపడింది. కానీ అంతకు ముందు 2004, 2009 ఎన్నికలలో ఇదే పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి దాదాపుగా లక్ష మెజారిటీతో విజయం సాధించాడు. అందుకే వైఎస్ జగన్ కూడా గత ఎన్నికలలో చేసిన తప్పు మరోసారి పునరావృతం కాకుండా మాగుంటను పార్టీలోకి తీసుకు వచ్చి ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించడానికి సిద్ధమవుతున్నారు.

మాగుంట వైసీపీ తరుపున పోటీ చేస్తే గత ఎన్నికలలో కోల్పోయిన కనిగిరి, దర్శి, కొండేపి, ఒంగోలు అసెంబ్లీ సీట్లను కూడా సులువుగా కైవసం చేసుకుకోవచ్చని అక్కడ లోకల్ గా ఉండే పార్టీ నాయకులు వైఎస్ జగన్ కు చెప్పడంతో పాటు, సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పడంతో జగన్ తన బాబాయ్ అని కూడా చూడకుండా బంధుత్వాన్ని పక్కన పెట్టి వైసీపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించినా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడూ అసెంబ్లీ స్థానాలలో నాలుగు స్థానాలను కోల్పోవడం వైఎస్ జగన్ కు కొంత ఇబ్బందిగా మారడంతో, మార్పుపైనే దృష్టి పెట్టాడు.

వైఎస్ జగన్ వేస్తున్న ఎత్తులకు చంద్రబాబు నాయుడుకి తెలుగు దేశం పార్టీ నుంచి సరైన అభ్యర్థి దొరకక, ఏపీ మాజీ డీజీపీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చి ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మొత్తం పార్టీ అధిష్టానమే భరిస్తుందని చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అదే మాజీ డీజీపీ గతంలో వైఎస్ జగన్ తో మంతనాలు చేసి వైసీపీ పార్టీలో చేరడానికి సన్నద్ధమవ్వగా చంద్రబాబు నాయుడు అప్పట్లో అడ్డుపుల్ల వేసి అతనిని వైసీపీలోకి వెళ్లకుండా ఆపగలిగారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన ఓపెన్ ఆఫర్ కు టీడీపీ బుట్టలో పడతారా లేక, ఎందుకొచ్చిన తలనొప్పి అని పక్కన కూర్చుంటాడా చూడాలి.