వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఇచ్ఛాపురంలో తన ప్రజాసంకల్ప పాదయాత్రను ముగించుకొని ఈరోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి అలిపిరి నుంచి తిరుమలకు మెట్ల ద్వారా చేరుకున్నారు. వైఎస్ జగన్ వెంట వైసిపి పెద్దలతో పాటు, వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఇక వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోవడానికి సామాన్య భక్తుడి వలే, భక్తులతో కలసి శ్రీవారిని దర్శించుకొని ఇప్పుడే బయటకు వచ్చారు.

ఇక పచ్చ మీడియాలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన గురించి రాయడానికి ఎటువంటి వార్తలు దొరకక, జై జగన్ నినాదాలతో తిరుమలలో వైసీపీ కార్యకర్తలు హల్ చల్ చేస్తున్నారని, జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి లోపలకు వెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగిందని, దీనితో సామాన్య భక్తులు భయబ్రాంతులకు గురవుతున్నారని టీడీపీ పార్టీ బినామీ ఛానల్ లో పుంఖాను పుంఖాలు వార్తలు వేస్తూ వారి పైశాచికత్వం చూపిస్తున్నారు.

Ys Jagan visit tirumala Temple

వైసీపీ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే పార్టీ శ్రేణులకు, ఏపీ ప్రజలకు తెలియచేస్తూ వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రాజకీయం చేయడానికి పచ్చ మీడియాతో పాటు, టీడీపీ పెద్దలు కుయుక్తులు పన్నుతున్నారని అందరూ జాగ్రత్తగా ఉండి వారి మాటలను పరిగణలోకి తీసుకోవద్దని పిలుపునిచ్చారు. కానీ రోత మీడియాకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటనలో ఎలాంటి బొక్కలు దొరుకుతాయో అని వెతికి చివరకు ఎటువంటి ఇబ్బందులు సామాన్య భక్తులకు కలగకుండా ప్రశాంతంగా శ్రీవారిని దర్శించుకొని బయటకు వస్తే అవేమి పట్టనట్లు వైఎస్ జగన్ మీద బురద జల్లే ప్రయత్నం గట్టిగా చేస్తుంది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి తప్పులకు తావివ్వకుండా అలిపిరి నుంచి మెట్ల మార్గంలో వెళ్లే క్రమంలో కూడా చెప్పులు లేకుండా నిష్ఠగా శ్రీవారిని దర్శించుకుంటే, పచ్చ మీడియాకు మాత్రం అవేమి కనపడకుండా, ఎవరకి కనపడని తొక్కిసలాట ఆ మీడియా ఛానల్ కు మాత్రమే దొరికాయనట్లు గలీజు రాతలతో మరోసారి విమర్శలపాలవుతుంది.

Ys Jagan visit tirumala Temple