వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరిని వైఎస్ షర్మిల ఈరోజు హైదరాబాద్ లోని కమిషనరేట్ కార్యాలయానికి వచ్చి తనపై, తన కుటుంబంపై జరుగుతున్న దృష్ప్రచారానికి సంబంధించి కంప్లైంట్ చేయడానికి వచ్చారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తరువాత వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీ హీరో ప్రభాస్ కు తనకు సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ఒక వర్గం వారు చేస్తున్న దృష్ప్రచారాన్ని ఆపాలని, ఇలాంటి లేనిపోని దృష్ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరామని చెప్పారు.

తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని హీరో ప్రభాస్, తనకు ఎలాంటి సంబంధము లేదని నా పిల్లపై ప్రమాణం చేసి చెబుతున్నానని, నాపై ద్రుష్పచారం చేస్తున్న వారు తమ పిల్లలపై ప్రమాణం చేసి చెప్పగలరా అని షర్మిల ప్రశ్నించారు. 2014 ఎన్నికల ముందు మొదలైన ఈ ప్రచారం తాము అప్పట్లో పోలీసులకు కంప్లైన్ట్ ఇస్తే కొన్ని రోజులు ఆపేశారని, మరలా ఇప్పుడు ఎన్నికలు వస్తున్న సందర్భంగా మరోసారి ఇలాంటి ప్రచారాన్ని లేవనెత్తి తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడానికి చూస్తున్నారని అన్నారు.

ఇంకా షర్మిల మాట్లాడుతూ ఇలాంటి దాడులు తన ఒక్క దాని మీద కాకుండా సోషల్ మీడియాలో చాల మంది మహిళలపై జరుగుతుందని, తనపై జరుగుతున్న దాడిని కండించవలసిందిగా మహిళలను, తమ కుటుంబాన్ని ప్రేమించే అభిమానులను, నైతికత ఉన్న రాజకీయ నాయకులను, జర్నలిస్టులను కోరుతున్నామని షర్మిల అన్నారు. అప్పట్లో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ నాయకుడని ప్రచారం చేసిన తెలుగుదేశం సభ్యులు, తరువాత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎంత గొప్ప సుపరిపాలన అందించారో అందరకి తెలిసిన విషయమేనని, అలానే తన అన్న జగన్ మీద కూడా జగన్ కు గర్వమెక్కువ, ఎవరని లెక్క చేయడని…ఇలాంటి ఎన్నో ఆరోపణలే చేస్తున్నారని, కానీ పాదయాత్రలో జగన్ ప్రజలతో ఏవిధంగా మమేకమయ్యాడో రాష్ట్ర ప్రజలందరూ చూశారని షర్మిల అన్నారు.

తనపై చేస్తున్న ప్రచారంలో తెలుగుదేశం పార్టీ పాత్ర ఉందని నమ్ముతున్నానని, మొదటి నుంచి తెలుగుదేశం సభ్యులు తనపై తన కుటుంబంపై దృష్ప్రచారం చేస్తూనే ఉన్నారని, నాయకుడు మంచి వాడైతే, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కూడా మంచి వారవుతారని, కానీ పిల్ల నిచ్చిన మామ కుర్చీని లాక్కున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి పార్టీకి చెందిన సభ్యులు చేస్తున్న ఆరోపణలతో తాము కలత చెందామని, నేరుగా తాము తెలుగుదేశం పార్టీ మీదనే కంప్లైన్ట్ ఇచ్చామని షర్మిల అన్నారు. తమకు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద నమ్మకం లేకనే తెలంగాణాలో కంప్లైన్ట్ ఇచ్చామని మీడియా వారు అడిగిన ప్రశ్నకు షర్మిల సమాధానం ఇచ్చారు. షర్మిల ఇచ్చిన కంప్లైంట్ తో పోలీసులు సీరియస్ గా కేసుని దర్యాప్తు చేసి మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయకుండా నిర్ములించవలసిన అవసరం ఉంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న దాడిని కూడా అరికట్టేలా చర్యలు తెసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.