వైఎస్ జగన్ మీద గత ఏడు సంవత్సరాలుగా పలు ఛార్జీషీట్స్ వేస్తూ వేధిస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని సంవత్సరాల తరువాత ఎన్నికల ముందు వైఎస్ జగన్ భార్య భారతిపై ఈడీ చార్జిషీట్ వేసి వైఎస్ కుటుంబ సభ్యులకను కూడా వేధించడానికి సిద్ధమైందని వైసిపి ఆరోపిస్తుంది. ఏడు సంవత్సరాల తరువాత భారతిపై కేసు పెట్టాలని ఈడీ అధికారులకు గుర్తుకు రావడమే ఆశ్చర్యంగా ఉంది. భారతి సిమెంట్ కు సంబంధించి ఇప్పటి వరకు వేసిన ఎటువంటి చార్జిషీట్ లో భారతి ప్రస్తావన లేదు. కానీ ఎన్నికల సమయంలో వైసిపిని టార్గెట్ చేయడానికి ఇలాంటి చార్జిషీట్ వేస్తున్నారా అనిపిస్తుంది.

వైఎస్ జగన్ మీద 2014 ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఆరోపణలు చేసారో, ఇప్పటికి అవే ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం పార్టీ పబ్బం గడుపుకుంటుంది. ఇక 2019 ఎన్నికలలో కూడా వైఎస్ జగన్ పై అలాంటి ఆరోపణలే చేస్తే ప్రజలు నమ్మేలా లేరని, కొత్తగా జగన్ భార్యపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. జగన్ భార్య కూడా అక్రమార్జన చేసిందని ప్రజలకు తెలియచేసే పనిలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇద్దరి ఈడీ అధికారులు పనిచేస్తున్నారని వైసిపి ఆరోపిస్తుంది.

వైసిపి అధినేత దీనిపై ఇప్పటికే ఒక బహిరంగ లేఖ ప్రజలకు రాయటం జరిగింది. దానిలో తన భార్య ఏమి చేసిందని, తన కుటుంబసభ్యులను కూడా తెలుగుదేశం పార్టీ బిజెపితో కలసి వేధించడానికి సిద్దమైనది తెలియచేసారు. వైసిపి అధినాయకత్వం కూడా తెలుగుదేశం పార్టీ – బిజెపి – కాంగ్రెస్ మూడు పార్టీ లు కలసి ఒక్క వైఎస్ జగన్ మీద ఎలాంటి కుట్రలు చేస్తున్నారనేది ప్రజలలో బలంగా వెళ్లేలా చేసారు. దీనితో ఇప్పుడు వైఎస్ జగన్ కుటుంబంతో పాటు, వైసిపి పార్టీకి సానుభూతి పవనాలు వీస్తున్నట్లు తెలుస్తుంది.

చంద్రబాబు నాయుడు నేరుగా ఓటుకి కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిపోయినా ఇంత వరకు చంద్రబాబుని ఏమి చేయలేని వారు, జగన్ విషయంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రజలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులు వైఎస్ జగన్ బిజెపితో కలసి పోయాడని ప్రచారం చేసిన తెలుగుదేశం పార్టీ, పచ్చ పత్రికలు… ఇప్పుడు వైఎస్ భారతి మీద వేసిన చార్జిషీట్ తో తెలుగుదేశం – బిజెపి ఒక్కటే అని నిర్ధారణకు ప్రజలు వచ్చినట్లు తెలుస్తుంది.

దీనిపై తెలుగుదేశం సభ్యులు వైఎస్ జగన్ ప్రతిష్ట మసకబార్చాలని చూస్తే తిరిగి తెలుగుదేశం పార్టీకే చుట్టుకోవడంతో టిడిపి మంత్రులు హడావిడిగా ప్రెస్ మీట్స్ పెట్టి వైఎస్ జగన్ పై చార్జిషీట్ వేస్తే తెలుగుదేశానికి ఏమి సంబంధమని గగ్గోలు పెడుతున్నారు. ఎవరెన్ని గగోలు పెట్టిన జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందని, ఇన్ని రోజులు నిజంగానే వైఎస్ జగన్ బిజెపితో కలుస్తాడా అని పచ్చ పత్రికలు వండి వార్చిన విషయాలను నమ్మిన ప్రజలకు ఇప్పుడు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చిందని, వైఎస్ జగన్ ఎప్పటికి బిజెపితో కలసి పనిచేసే అవకాశం లేదని, తెలుగుదేశం పార్టీ పగలు కాంగ్రెస్ పార్టీతో రాత్రి బిజెపితో కలసి సంసారం చేస్తుందని దీనితో వైసిపి పార్టీకే లాభం చేకూరిందని వైసిపి విశ్వసనీయత ఏమిటో ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకున్నారని ప్రజలలో భావన మొదలైంది.