వైఎస్ జగన్ మోహనే రెడ్డి పాదయాత్ర పేరుతో దాదాపుగా సంవత్సర కాలంగా ప్రజల మధ్యే తిరుగుతూ నిరంతరం ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ ఎన్నికలు ముంచుకొని రావడంతో వైసిపి తెలంగాణ శ్రేణులు వైఎస్ జగన్ ప్రచారానికి వచ్చి తెలంగాణాలో వైసిపి సత్తా ఏమిటో చూపించాలని ఆశించారు. కానీ వైఎస్ జగన్ టార్గెట్ పూర్తిగా 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలపైనే ఉండటంతో తెలంగాణపై దృష్టి పెట్టే అంత సమయం లేకపోవడంతో, చివరగా ఒక నిర్ణయానికి వచ్చి తెలంగాణ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని, 2024 లో తెలంగాణాలో పార్టీని గ్రామ గ్రామానికి వైసిపి పార్టీని తీసుకొని వెళ్లేలా ప్రణాళికలు రచిస్తామని పార్టీ నుంచి నోట్ విడుదల చేసారు.

వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు ఎవరకి వినియోగించుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొని ఉంది. వైఎస్ జగన్ పాదయాత్ర ముగించుకొని హైదరాబాద్ వస్తున్న సమయంలో జరిగిన కత్తి దాడిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా, తెలుగుదేశం సభ్యులు జగన్ కావాలని కత్తి దాడి చేయించుకున్నాడని, మరొక టిడిపి నేత బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే విజయమ్మ, షర్మిల కలసి కుట్ర పన్ని పార్టీని తమ చేతిలోకి తీసుకోవాలని చేయించారని మాట్లాడటంతో అన్ని వర్గాల ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది.

ఇక, తెలంగాణాలో కూడా తెలుగుదేశం పార్టీ మహాకూటమితో జత కట్టడంతో, ఇప్పటి వరకు ఒక వర్గానికి చెందిన ప్రజలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చారు. ఈసారి వారంతా ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ పై జరిగిన దాడిని ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు కనీసం కందించకపోగా, ఎటకారపు నవ్వులు నవ్వుతు వైఎస్ జగన్ పై జరిగిన దాడి చాల చిన్నదిగా చూపిస్తూ చేసిన హడావిడికి మహాకూటమితో కలసిన తెలుగుదేశం పార్టీతో పాటు, కాంగ్రెస్ పార్టీకి కూడా షాక్ ఇవ్వడానికి ఆ వర్గం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తుంది..

ఈ పరిణామాలు భాగ్యనగరంలో స్పష్టంగా కనపడతాయని, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉండే ఒక వర్గం తప్ప సెటిలర్స్ అంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని ఒక సర్వే తెలియచేస్తుంది. ముఖ్యంగా రాయలసీమ, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రకు చెందిన సెటిలర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడుతో పాటు, తన ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు విసిగిపోయి కేసీఆర్ కు మరోసారి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. కొంత కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన సెటిలర్స్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలంగాణాలో మహాకూటమికి ఓటు వేయాలని నిర్ణయానికి వచ్చారట.  

మరొక వైపున కాంగ్రెస్ పెద్దలు అమరావతి వెళ్లి తెలంగాణ సీట్ల విషయంలో చంద్రబాబుతో చర్చలు చేసారని మీడియాలో మెయిన్ స్ట్రీమ్ వార్తలా రావడంతో, తెలంగాణ ప్రజలు కూడా చంద్రబాబు పెత్తనం ఆంధ్రపై ఏమిటనే గుస్స మొదలైనట్లు తెలుస్తుంది. ఇది పైకి అంతగా కనిపించకపోయినా ఓట్ల పండుగా రోజు స్పష్టంగా కనపడి, మహాకూటమిని చావు దెబ్బ కొట్టడం ఖాయంగా కనపడుతుంది. ముఖ్యంగా వైఎస్ జగన్ పై జరిగిన దాడికి చంద్రబాబు స్పందనపైనే అన్ని వర్గాలలో గట్టిగా తేడా కొట్టడంతో, వైఎస్ జగన్ కూడా తెలంగాణ ఎన్నికలలో తాము పోటీలో ఉండటం లేదని నిర్ణయించుకోవడంతో, వైఎస్ జగన్ కు పడే ప్రతి ఓటు టిఆర్ఎస్ వైపు మళ్లుతుందని టిఆర్ఎస్ శ్రేణులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు.