రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఏపార్టీ ఎటు సపోర్ట్ చేస్తాయని సందిగ్ధత నెలకొంది. తెలుగుదేశం చేస్తున్న ప్రచారం మాత్రం  వైసిపి పార్టీ బిజెపితో కలసి పోయి డిప్యూటీ చైర్మన్ ఎన్నికలలో సపోర్ట్ చేస్తుందని తెలుగుదేశం పార్టీ తమ పచ్చ చానెల్స్ చేత రోజు ఉదరగొట్టిస్తుంది. దీనిపై స్పందించిన విజయ సాయిరెడ్డి మేము బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని, ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వకుండా తూట్లు పొడిచిన బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని తెలియచేసారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో తెలుగుదేశం ప్రభుత్వానికి పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లైనది. రాజ్యసభ డిప్యూటీ ఎన్నికలను సాకుగా చూపి వైసిపి పార్టీని బద్నామ్ చేయడానికి పచ్చ కూటమి కాపు కాసి ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ బయటకు బిజెపిని విమర్శిస్తున్నా, లోలోన మద్దతు ఇస్తుందని వైసిపి పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఇక తెలుగుదేశం పార్టీ బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేస్తుందా లేదా అనేది చూడాలి.